చెప్పకుండా మాయమవడం
మేము అర్థం చేసుకుంటాం. కొన్నిసార్లు సరిగ్గా కుదరదు, ఒక జోడీ నుండి ముందుకు సాగే సమయం వచ్చిందని మీరు నిర్ణయించుకుంటారు.
జోడీ విడదీసే ముందు, అవతలి వ్యక్తికి తెలియజేస్తూ ఒక చిన్న, ఆప్యాయమైన సందేశం పంపమని మేము సూచిస్తున్నాం. దీనివల్ల గౌరవం నిలుస్తుంది, ఎవరూ జవాబు కోసం ఎదురుచూస్తూ ఉండిపోవాల్సిన అవసరం ఉండదు.
మీ జోడీ 3 రోజులకు పైగా మీ సందేశాలకు జవాబు ఇవ్వకపోతే, వారు చెప్పకుండా మాయమైనట్లు మీరు చాట్ స్క్రీన్లో రిపోర్ట్ చేయవచ్చు.
ఎవరినైనా రిపోర్ట్ చేసినప్పుడు, వారు మాయమైనట్లు వచ్చిన రిపోర్ట్ల సంఖ్య (ఒక సరదా “మాయ-మీటర్”) 1 పెరుగుతుంది. ఈ సంఖ్య వారి భవిష్యత్ జోడీలకు కనిపిస్తుంది: మెరుగైన సంభాషణ కోసం ఒక చిన్న ప్రోత్సాహం మాత్రమే.
ఈ సంఖ్య మరీ ఎక్కువైతే… ఈ సందేశాన్ని మాకు మేమే రాసుకోవాల్సి వస్తుందని మాత్రం చెప్పగలం.
…హలో? మీరు ఇంకా అక్కడే ఉన్నారా? 😨