ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి
ఆన్‌లైన్‌లో కొత్త వ్యక్తులను కలవడం ఉత్సాహంగా ఉండొచ్చు, కానీ అందులో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. విషయాలను ముందుకు తీసుకెళ్లే ముందు ఎవరినైనా తెలుసుకోవడానికి, వాయిస్ మరియు వీడియో కాల్స్ వంటి యాప్‌లోని ఉచిత ఫీచర్లను ఉపయోగించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
⚠️ గమనించాల్సిన 3 హెచ్చరిక సంకేతాలు:
1. ఫోన్ నంబర్ అడగడం
జోడీ కుదిరిన వెంటనే మీ ఫోన్ నంబర్ అడగడం. యాప్‌లో చాట్, వాయిస్/వీడియో కాల్స్ ఉచితం, కాబట్టి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి: వారికి మీ వ్యక్తిగత ఫోన్ నంబర్ ఎందుకు కావాలి?
2. వేరే యాప్‌కు మారమని అడగడం
వేరే యాప్ (ఉదా. Telegram) లేదా వారు నిషేధం నుండి తప్పించుకోగలిగే ఏదైనా అంతగా తెలియని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని అడిగి, ఆ తర్వాత సంభాషణను అక్కడికే మార్చాలని పట్టుబట్టడం. జాగ్రత్తగా ఉండండి: ఇది భద్రతా ఫీచర్ల నుండి మిమ్మల్ని దూరం చేసే ఒక ఎత్తుగడ కావచ్చు.
3. ఒత్తిడి లేదా బలవంతం
మీకు ఇష్టం లేని పనులు చేయమని మీపై ఒత్తిడి తేవడం, ఉదాహరణకు మీరు “వద్దు” అని చెప్పిన తర్వాత కూడా అసభ్యకరమైన ఫోటోల కోసం పదే పదే అడగడం. ఎవరైనా మీ హద్దులను లేదా గోప్యతను గౌరవించలేకపోతే, తర్వాత ఇతర విషయాల్లో కూడా వారు మిమ్మల్ని గౌరవించే అవకాశం తక్కువ.
💡 గుర్తుంచుకోండి: మీ అంతరాత్మను నమ్మండి. ఎవరినైనా మీ స్నేహితులకు లేదా కుటుంబానికి పరిచయం చేయడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే, తదుపరి దశకు వెళ్లడానికి ఇంకా తొందరగా ఉండొచ్చు.
మీ భద్రతకే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం.